E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో బుధవారం డ్వాక్రా CAలకు MLA మద్దిపాటి వెంకటరాజు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి, సిబ్బంది పనితీరు మెరుగుపర్చేందుకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CAలు కుసుమ, సుమతి, కాంచన పాల్గొన్నారు.