BPT: బల్లికురవ మండలంలోని కుమ్మినేనివారిపాలెం గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా వరి మద్దతు ధరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రబి సీజన్లో పండించిన వరిని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. సాధారణ రకం వరికి రూ.2369, ఏ-గ్రేడ్ వరికి రూ.2389 మద్దతు ధరను నిర్ణయించారు.