కృష్ణా: ఈ నెల 13న సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో 10:30 గంటల నుంచి ‘మీకోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)’ కార్యక్రమం ఉందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని, తద్వారా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.