సత్యసాయి: ధర్మవరం ఆర్డీవో మహేశ్, డీఎస్పీ హేమంత్ కుమార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ విజయానంద్ వీరికి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని సూచించారు. పరిపాలనా కారణాల వల్ల ఈ ఆకస్మిక బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.