కోనసీమ: ప్రతి నియోజకవర్గంలో మీడియా హౌస్ల ఏర్పాటుకు కృషి చేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ హామీ ఇచ్చారు. అంబాజీపేటలో రూ.37 లక్షలతో నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, రైల్వే పాసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.