ELR: ఇంటర్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏలూరులో గురువారం రాత్రి జరిగింది. వెంకటాపురం పంచాయతీ సాయి నగర్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివ దుర్గాప్రసాద్(16) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు స్పందించి శివను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.