కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్చి ముగింపు లెక్కల నిర్వహణతో పాటు బ్యాంకు లావాదేవీలు నిలిపివేయనున్నారు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు క్రయవిక్రయాలు జరగవని మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి ఇవాళ తెలిపారు. ఈనెల 27న శ్రీరామనవమి పండుగ సందర్భంగా మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించామన్నారు. రైతులు,వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.