శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఈనెల 20న సోంపేటలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెలుగు కార్యాలయంలో జరగబోవు ఇంటర్వ్యూలో అపిటోరియా ఫార్మా, డెక్కన్ కెమికల్స్, స్నైడర్, స్టెల్లాంటిస్ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈఎంపికలు నిర్వహిస్తున్నారు.