WG: భీమవరంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాల్లో నరసాపురం విద్యార్థిని అద్భుత ప్రతిభకనబరిచింది. జూనియర్స్ విభాగం ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో నరసాపురం స్టీమర్ రోడ్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల 5వ తరగతి విద్యార్థిని ఎం. రమ్యశ్రీ ప్రథమ బహుమతి సాధించింది. రమ్యశ్రీని, ఆమెకు దిశానిర్దేశం చేసిన హెచ్ఎం సుధీర్ బాబును డీఈవో నారాయణ అభినందించారు.