ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జ్యోతి బసు ఓ ప్రకటనలో తెలిపారు. 22న ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకొచ్చారు.