కోనసీమ: అయినవిల్లిలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష అభిషేకం నిర్వహించి, 108 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించారు.