NLR: సర్వేపల్లి నియోజకవర్గంలోని వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు మంజూరయ్యాయి. ముత్తుకూరులో ఇవాళ జరిగిన కార్యక్రమంలో MLA సోమిరెడ్డి చేతుల మీదుగా అందరికీ పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళలు తమ కాళ్లపై తామే నిలబడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పొదుపు గ్రూపులను 1994లో ఏర్పాటు చేశారని చెప్పారు. దీనిని మోడల్‌గా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయని చెప్పారు.