నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత శుక్రవారం 54వ డివిజన్ వెంకటేశ్వరపురం మున్సిపల్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను బహూకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.