అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి నెల పండుగను ఈ నెల 17వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ఈఓ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. జాతరలో భాగంగా గురువారం సాయంత్రం పురవీధుల్లో ఘటాలను ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. రాత్రంతా ఆలయం తెరిచి ఉంటుందన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని మూసివేసి ఉదయం తెరుస్తామన్నారు.