KDP: ఎర్రగుంట్లలో సోమవారం బైక్ అదుపుతప్పి దూదేకుల జిలాని భాష అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో చికిత్స నిమిత్తం దాతల సహాయం కోసం యువకుడి తల్లి రసూల్ బి కన్నీటితో వేడుకుంటోంది.