విశాఖలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు 2026–27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ డీఈవో ప్రేమ్‌కుమార్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ.. అక్రమ ప్రచారం, అధిక ఫీజులు, అనుమతులు లేకుండా తరగతులు, హాస్టళ్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.