KDP: పోలీస్ అధికారులు తప్పనిసరిగా పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టాలని ఎస్పీ నచికేత్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప డివిజన్ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా గ్రామాలలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన జూదం, మట్కా తదితర వాటిపై కూడా ప్రత్యేక దృష్టిని నిలపాలన్నారు.