కాకినాడ: కృత్రిమ మేధస్సు కారణంగా ఉద్యోగాలలో మార్పులు వస్తున్నాయని, ఇది దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. శుక్రవారం జేఎన్టీయూలో UCEK వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వీసీ ప్రొఫెసర్ ప్రసాద్, రెక్టార్ సుబ్బారావు, తదితరులు హాజరయ్యారు.