VZM: గంజాయి నిర్మూలనకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ కొత్తవలస పోలీసు స్టేషను పరిధిలోని పలు వీధులలో సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఆటో ద్వారా ప్రచారం చేశారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని వాహనదారులను హెచ్చరించారు. గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా చేసినా, సేవించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని చెప్పారు.