KRNL: పెద్దకడుబూరు మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో 2026- 27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు పెంపు కోసం “బడి పిలుస్తోంది” కార్యక్రమం భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో రామ్మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.