NTR: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అనవసరంగా ఎవరూ గుమికూడరాదని, తల్లిదండ్రులు,ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.