ప్రకాశం: ఒంగోలులో ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యాంప్ అధికారి పి.వి. రేణుక తెలిపారు. ఈ క్యాంప్‌లో పరీక్షా పత్రాల మూల్యాంకనం వేగవంతంగా చేపట్టి, ఫలితాలను త్వరగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.