SS: జిల్లాలో సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాగు విస్తీర్ణాన్ని 10 శాతం పెంచాలని, 15 శాతం వృద్ధిరేటు సాధించాలని సూచించారు. వరికి నుంచి మొక్కజొన్న, రాగి వంటి ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు.