సత్యసాయి: పెనుకొండలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ సోమవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలు జయమ్మ, కార్యదర్శి బావమ్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు.