PLD: ఎడ్లపాడు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తిమ్మాపురం జాతీయ రహదారిపై మానసిక స్థితి సరిగ్గా లేక తిరుగుతున్న కాకినాడ వ్యక్తిని గుర్తించి, రెండు రోజుల పాటు రక్షణ కల్పించారు. శనివారం అతని కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. శాంతిభద్రతలతో పాటు మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ పేర్కొన్నారు.