AKP: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటపతి రాజు అన్నారు. శనివారం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లలో పిల్లలకు పాఠాలు చెప్పే సమయం కన్నా యాప్ల ద్వారా చేస్తున్న అదనపు పనులే ఎక్కువగా ఉన్నాయన్నారు.