నెల్లూరు జిల్లా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. పొరుగు రాష్ట్రాల బోట్ల చొరబాటును అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, 24X7 గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 14 వరకు నిరంతర నిఘా ఉంటుందని, మత్స్యకారులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.