SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంగళవారం ఎమ్మెల్యే సామేలు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.