కోనసీమ: రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజల ద్వారా 168 అర్జీలు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు తదితర అంశాలపై అర్జీలు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.