SKLM: వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివ సాగర్ బీచ్లో ఇవాళ ఉదయం జరిగిన ‘స్వచ్ఛ సర్వేక్షన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నేతలతో కలిసి బీచ్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.