KRNL: ఆదోని శివారు కొండలలోని శ్రీ రణమండల ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. విశేష దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చనలు, అభిషేకాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా కమిటీ సభ్యులు సకల ఏర్పాట్లు చేశారు.