ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్లో రైలు సమీపిస్తున్న సమయంలో ఒక మహిళ ట్రాక్‌పైకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ప్రమాదాన్ని గమనించిన కమ్యూనికేషన్ కానిస్టేబుల్ డేవిడ్ వెంటనే ట్రాక్‌పైకి దిగి ఆమెను పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. రైలు దగ్గర్లోనే ఉన్నప్పటికీ తన ప్రాణాలను లెక్కచేయకుండా స్పందించారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.