VSP: జీవీఎంసి స్థలాలు, భవనాలు, పార్కులు, స్టేడియంలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని CPM విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో జరిగిన ప్రెస్ మీట్లో డాక్టర్ బి. గంగారావు మాట్లాడుతూ..టెండర్లు రద్దు చేయాలని కోరారు. సుమారు 600 ఎకరాల భూములు, 940 షాపులు పిపిపి పేరుతో లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.