కోనసీమ: కేవలం 21 నెలల స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను సూపర్ హిట్గా అమలు చేసిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల కోసం రూ.60 వేల కోట్లు, రైతు పెట్టుబడి సాయం కింద రూ. 2676 కోట్లు పంపిణీ చేశామన్నారు.