కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కారం వేదికలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రజల వద్ద నుండి 5 అర్జీలను స్వీకరించారు. శానిటేషన్ కు సంబంధించి 1 అర్జీ, ఆక్రమణలకు సంబంధించి 2 అర్జీలు, న్యూ డ్రైనేజ్ నిర్మాణం కోసం 2 అర్జీలు కమిషనర్‌కు అందాయి. సంబంధిత శాఖ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.