SRD: సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలోని ఓ ఇంట్లోకి శనివారం పాము రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. వేడి తాళలేక, పరిసరాల్లో ముళ్లపొదలు పెరగడంతో పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పిచ్చిమొక్కలను తొలగించి, గ్రామాన్ని శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టి తమకు రక్షణ కల్పించాలి.