VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనెల 22న అంతర్జాతీయ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఏయూలో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ దేశాల సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ విడుదల చేశారు.