AP: గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా YCP నేతల తీరు మారలేదని TDP నేత ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. అవినీతి, దోపిడీ జగన్కు 2 కళ్లు అని.. రాజధానిపై చిమ్మే ప్రతి విషపు బొట్టు ఆయన పతనానికే కారణమవుతుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతిని బలపరిస్తేనే ప్రజల్లో ఉండగలుగుతామని ఆ పార్టీ నేతలు గ్రహించాలని హితవు పలికారు.