NRPT: దామరగిద్ద మండల కేంద్రంలోని కిష్టారెడ్డి కాలనీలో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కనికిరెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద రూ.5 లక్షలతో రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.