NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని PACS ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.