SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 7న జెండా ఊరేగింపు, 8న బోనాల సమర్పణ, మరియు 9న కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.