WGL: నర్సంపేట పట్టణంలోని భృణహత్యలు జరుగుతున్నాయన్న పత్రికా వార్తలపై డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాష్ స్పందించారు. ఈ సందర్భంగా స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రుల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ చర్యల పై ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.