TG: ఖమ్మం జిల్లా కొనిజర్ల వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తెల్లవారుజామున లారీ, కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మృతులు రాజమహేంద్రవరానికి చెందిన వీర్రాజు, వీర శైలజగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.