NZB: సిరికొండ మండలం రామడుగులో రూ. 2.10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ వరలక్ష్మి సంతోష్ పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు.. లబ్ధిదారులు ఆకుల లక్ష్మి, సాయిలు, రమ్య, నరసయ్యలకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని సర్పంచ్ పేర్కొన్నారు.