NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువులో మత్స్యకారులు చేపల వేట కొనసాగించి సుమారు 5 టన్నుల డెవిల్ ఫిష్లను పట్టుకున్నారు. కాల్వల ద్వారా చేరిన ఈ విదేశీ చేపలు చెరువులోని ఇతర చేపలను తినేస్తుండటంతో, తమ జీవనోపాధి దెబ్బతింటోందని గ్రామంలోని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వీటిని తొలగించి తమను ఆదుకోవాలని కోరారు.