MDK: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో ఎల్లయ్యలతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 98 దరఖాస్తులు స్వీకరించారు.