MDCL: నిరుపేద ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. అల్వాల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో యాప్రాల్, కౌకూర్, మచ్చబొల్లారం ప్రాంతాల్లో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు.