నల్గొండ పట్టణ కేంద్రంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ అధ్యక్షుడు గర్రె మురళి జెండా ఆవిష్కరించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రతినిధి చిన్నేని జానీ, సైదులు, శ్రీను, రేణుక తదితరులు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.