SDPT: జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లాలోని RVM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక మహిళకు అత్యవసరంగా రక్తం అవసరమని తెలుసుకున్న ములుగు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సురేశ్, వెంటనే స్పందించి ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి ప్రాణదాతగా నిలిచిన కానిస్టేబుల్కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.