GDWL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో పలువురు నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.